Hyderabad Metro: మెట్రో రెండో దశ రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 రూట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన రూట్ మ్యాప్‌ను రద్దు చేసింది.
By అంజి Published on 23 Jan 2024 2:30 AM GMTHyderabad Metro: మెట్రో రెండో దశ రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 రూట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన రూట్ మ్యాప్‌ను రద్దు చేసింది. నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా, మెట్రో విస్తరణ ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలు విమానాశ్రయాన్ని హైదరాబాద్‌లోని నాలుగు మూలలకు కలుపుతాయి. మెజారిటీ ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా చూస్తాయి.
మొత్తంగా రెండో దశలో 70 కి.మీ దూరంతో కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేలా ఈ ప్రతిపాదనలను మెట్రో అధికారులు రూపొందించారు. ప్రస్తుతం మియాపూర్ - ఎల్బీ నగర్, జేబీఎస్ నుండి ఎంజీబీఎస్, నాగోల్ నుండి రాయదుర్గం మధ్య మూడు కారిడార్లలో 69 కి.మీ మేర హైదరాబాద్ మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఫేజ్-2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైలు నెట్‌వర్క్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు.
కొత్త కారిడార్లు
కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు (5.5 కిలోమీటర్లు)
కారిడార్ 2: ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలోమీటర్లు)
కారిడార్ 4: నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్ వరకు, అకడినుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు)
కారిడార్ 4: మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కిలోమీటర్లు)
కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్ష న్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్లు)
కారిడార్ 6: మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి బీహెచ్‌ఈఎల్ మీదుగా పటాన్‌చెరు వరకు (14 కిలోమీటర్లు)
కారిడార్ 7: ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు (8 కిలోమీటర్లు)