మూసీ నది సమీపంలో ఏడుపు శ‌బ్ధం.. వెళ్లి చూస్తే..

శనివారం ఉదయం రామంతపూర్‌లోని మూసీ నది సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలివేసారు.

By Medi Samrat
Published on : 12 July 2025 4:39 PM IST

మూసీ నది సమీపంలో ఏడుపు శ‌బ్ధం.. వెళ్లి చూస్తే..

శనివారం ఉదయం రామంతపూర్‌లోని మూసీ నది సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలివేసారు. బట్టలో చుట్టి ఏడుస్తున్న శిశువును గమనించిన స్థానికులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

ఉప్పల్ పోలీసుల సహాయంతో, అంబులెన్స్ సిబ్బంది మెరుగైన సంరక్షణ కోసం శిశువును నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉందని సిబ్బంది తెలిపారు. మూసీ నది సమీపంలో శిశువును వదిలివేసిన వ్యక్తుల వివరాలను తెలుసుకోవడానికి ఉప్పల్ పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు.

Next Story