గోషామహల్‌లో కుంగిన నాల..
Nala Collapses In Hyderabad Goshamahal. గోషామహల్‌లోని చక్నావాడి వద్ద శుక్రవారం ఒక్కసారిగా నాల కుంగిపోవడంతో వ్యాపారులు
By Medi Samrat Published on
23 Dec 2022 10:45 AM GMT

గోషామహల్‌లోని చక్నావాడి వద్ద శుక్రవారం ఒక్కసారిగా నాల కుంగిపోవడంతో వ్యాపారులు, దుకాణదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కొంత మంది కూరగాయల వ్యాపారులు శుక్రవారం కావడంతో రోడ్డుపై ఉన్న నాలపై దుకాణాలు పెట్టి మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా నాలాకుంగడంతో కార్లు, ఆటోలు, బైక్‌లు ధ్వంసం కావడంతో పాటు కొంత మంది వ్యాపారులకు స్వల్ప గాయాలయ్యాయి. హఠాత్తు పరిణామంతో చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. పోలీసులు కూడా స్థలానికి చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
Next Story