మోటార్ స్పోర్ట్ టీమ్ ను సొంతం చేసుకున్న నాగ చైతన్య
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రతిష్టాత్మకమైన మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్..
By Medi Samrat Published on 14 Sept 2023 8:00 PM ISTటాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రతిష్టాత్మకమైన మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్.. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) ను సొంతం చేసుకున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది.
నాగ చైతన్యకు మోటార్‌స్పోర్ట్‌పై ఉన్న అభిరుచి మొదటి నుండి ఉంది. నాగచైతన్య మాట్లాడుతూ.. “మోటార్‌స్పోర్ట్‌లో భాగం కావాలని ఎప్పుడునుంచో చూస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌లో భాగమైనందుకు చాలా అనందంగా వుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఇండియన్ మోటార్‌స్పోర్ట్‌లో ఔత్సాహికులందరికీ గొప్ప వినోదాన్ని అందిస్తుంది. యువ ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది." అని అన్నారు.
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తొలి సంవత్సరంలో, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అందరి ప్రశంసలు అందుకుంది. జట్టులోని ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు, అఖిల్ రవీంద్ర , నీల్ జానీ, డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రశంసనీయమైన 1-2 ఫినిష్ ని సాధించారు. RPPL చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ.. “భారతదేశంలో మోటార్‌స్పోర్ట్ కోసం మా విజన్‌లో నాగ చైతన్య చేరడం పట్ల మేము సంతోషిస్తున్నాము. నాగచైతన్య ప్రభావవంతమైన నటుడు మాత్రమే కాదు, మోటర్‌స్పోర్ట్ పట్ల అవగాహన ఇష్టం వుండి, భారతదేశంలో మోటార్‌స్పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి సహకరించాలనుకునే వ్యక్తి." అని అన్నారు.