పేదవాడు మురికిలోనే బతకాలా? మూసీ పునరుజ్జీవంపై విపక్షాలకు భట్టి ప్రశ్న
మూసీ పునరుజ్జీవం అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
By Knakam Karthik
పేదవాడు మురికిలోనే బతకాలా? మూసీ పునరుజ్జీవంపై విపక్షాలకు భట్టి ప్రశ్న
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మురుగు నీరు, ఈగలు, దోమల వంటి దయనీయ పరిస్థితుల మధ్య బతుకుతున్న పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆయన పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారు, పేదలు ఎప్పటికీ ఆ మురికి కూపంలోనే ఉండాలని కోరుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి, వారికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి ఆర్థికంగా అండగా నిలుస్తామని, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఈ మహాయజ్ఞానికి ప్రతిపక్షాలు అడ్డుపడటం సరికాదని, పేదవాడు మురికిలోనే బతకాలనే ధోరణిని వీడాలని ఆయన హితవు పలికారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత. మురుగు నీరు, ఈగలు, దోమలు మరియు రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా?నివాసాలు కోల్పోయే ప్రతి పేద… pic.twitter.com/vT347mGOBy
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) March 18, 2026