మెట్రోను పటాన్‌చెరు వ‌ర‌కూ పొడిగించండి

మెదక్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఎం.రఘునందన్ రావు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌కు తాజాగా లేఖ రాశారు

By Medi Samrat  Published on  18 Jun 2024 3:30 PM GMT
మెట్రోను పటాన్‌చెరు వ‌ర‌కూ పొడిగించండి

మెదక్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఎం.రఘునందన్ రావు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌కు తాజాగా లేఖ రాశారు. మియాపూర్ నుండి పటాన్‌చెరు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని.. అలా చేస్తే ఆ మార్గంలో ట్రాఫిక్‌ను తగ్గించవచ్చని సూచించారు. పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ఈ కారిడార్‌లో రోజురోజుకు రోడ్డు ట్రాఫిక్ పెరుగుతోందని, ఫలితంగా గణనీయమైన సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని రఘునందన్ రావు వివరించారు.

“మెట్రో లైన్‌ను పటాన్‌చెరు వరకు పొడిగించడం వల్ల ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుంది. ప్రయాణికుల భద్రత పెరుగుతుంది. అదనంగా.. ఈ పారిశ్రామిక హబ్‌లోని అనేక మంది కార్మికులు, నివాసితులకు ఇది విశ్వసనీయ, సమర్థవంతమైన రవాణా విధానాన్ని అందిస్తుంది, ”అని లేఖలో ప్రస్తావించారు.

మొదటి దశలో మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు.. రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో లైన్‌ను పొడిగించేలా పరిగణనలోకి తీసుకోవాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను కోరారు. మెట్రో లైన్‌ను పొడిగించేందుకు ప్రతిపాదిత అధికారులతో చర్చించాలన్నారు రఘునందన్ రావు.

Next Story