ఈటల ప్రసంగాన్ని అభినందించిన మోదీ, నడ్డా
Modi appreciated Etala's speech. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై
By Medi Samrat Published on 3 July 2022 5:13 PM ISTబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ప్రసంగించారు. 15 నిమిషాలు ఈటల ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం అంశాలను ఈటల ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీగా బీజేపీని నమ్ముతున్నారన్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని ఈటల అన్నారు. అయితే ఈటల ప్రసంగాన్ని ప్రధాని మోదీ, జేపీ నడ్డా అభినందించారు.
మరో వైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యవర్గ సమావేశాల అనంతరం సాయంత్రం సమయంలో.. ప్రధాని మోదీ హెచ్‌ఐసీసీ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు వచ్చారు. హెచ్ఐసీసీలో జాతీయ కార్యవర్గ భేటీ ముగియడంతో నేతలు నేతలు ఒక్కొక్కరుగా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ నేతలు కూడా పరేడ్ గ్రౌండ్స్ కు వస్తున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో పరేడ్ గ్రౌండ్స్ తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి.