తెలంగాణ సర్కార్ లాక్‌డౌన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పునఃప్రారంభమవుతున్నాయి. అయితే.. కరోనా కారణంగా 15 నెలల నుండి హైద్రాబాద్ స్టేషన్లకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు.. మళ్లీ కూత పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపడానికి.. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రావడంతో ఈ నెల 23వ తేదీ బుధవారం నుంచి పది రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. మున్ముందు పరిస్థితులను బట్టి రైళ్ల సంఖ్య పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అందుబాటులోకి రానున్న రైళ్ల వివరాలు :
ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి మూడు రైళ్లు,
లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మూడు రైళ్లు,
హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు రైళ్లు,
లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి.
ఇక.. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే తొలి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి రైలు ఉదయం 8.43 గంటలకు.. హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు.