ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి

MMTS Train Accident near Hyderabad Hitech City. హైటెక్ సిటీ-హఫీజ్ పేట్ రైల్వే లైన్‌లో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని

By Medi Samrat  Published on  26 July 2022 3:15 PM GMT
ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి

హైటెక్ సిటీ-హఫీజ్ పేట్ రైల్వే లైన్‌లో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను వ‌న‌ప‌ర్తికి చెందిన రాజ‌ప్ప‌(60), శ్రీను(35), కృష్ణ‌(50)గా గుర్తించారు. మృతులు సంకల్ప్ అపార్ట్ మెంట్ సమీపంలో నివసిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాలను ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story
Share it