కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక కోసం బీజేపీ ఆదిష్టానం తమ అభ్యర్థిగా దీపక్‌రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి టార్గెట్‌గా ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..ఇదేమి రాజ్యం, కిషన్ రెడ్డి రాజ్యం. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్‌లో ఒక బీసీ తెలంగాణకు సీఎం అవుతారని చెబుతూ ఉంటారు.
కానీ..చిన్న ఎన్నికలు లేదా పెద్ద ఎన్నికలు వస్తే బీసీలనే మర్చిపోతారు. ఇవాళ బీసీలు తెలంగాణ బీజేపీలో ఎక్కడున్నారో చెప్తారా కిషన్ రెడ్డి? నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల గురించి మాట్లాడలేదు. హిందుత్వం గురించే మాట్లాడుతాను. కానీ ఇవాళ మాట్లాడటానికి కారణం.. మీరు ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి, బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. అందుకే ఈ రోజు చెప్పాల్సి వచ్చింది..అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.