ఎమ్మెల్యే రాజా సింగ్ రోడ్ షో కాస్తా..!

Mla Raja singh Road Show. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయకులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా

By Medi Samrat  Published on  27 Nov 2020 2:39 PM IST
ఎమ్మెల్యే రాజా సింగ్ రోడ్ షో కాస్తా..!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయకులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. కూకట్ పల్లిలో రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొనగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రోడ్ షోలో పాల్గొంటోన్న రాజాసింగ్ వాహనం వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలను ఆయా పార్టీల నాయకులు సముదాయించారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాదులో మతకలహాలను రేకెత్తించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నారని... సమాచారం ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రాసిచ్చిన స్క్రిప్టును డీజేపీ చదువుతున్నారని, ఇది దిక్కుమాలిన చర్య అని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్కా సమాచారం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలని, జరగబోయే విధ్వంసాన్ని ఆపాలని అన్నారు. ప్రజలను భయపెట్టి, నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. విధ్వంసం సృష్టించి ఆ నిందను బీజేపీపై మోపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


Next Story