హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ఘనంగా జరిగింది. ఈరోజు అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వచ్చారు. తీన్మార్ సౌండ్ వినగానే ఎమ్మెల్యే డాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ బేగంబజార్‌లో బీఆర్ఎస్ నాయకుడు ధనరాజ్ ఏర్పాటు చేసిన ఫలహారం బండి ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మైనంపల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీన్మార్ డప్పులకు మైనంపల్లి హనుమంతరావు స్టెప్పులేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. మైనంపల్లి స్టెప్పులకు జనం విజిల్స్ తోడవడంతో ఊరేగింపులో మస్త్ జోష్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.