ఐపీఎల్ మ్యాచ్‌లు అడ్డుకుంటాం : ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLA Danam Nagendar Sensational Comments On IPL 2021. టీఆర్ఎస్ నేత‌, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఐపీఎల్ 2021 మినీ

By Medi Samrat  Published on  20 Feb 2021 2:01 PM IST
ఐపీఎల్ మ్యాచ్‌లు అడ్డుకుంటాం : ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీఆర్ఎస్ నేత‌, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఐపీఎల్ 2021 మినీ వేలానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టులో స్థానిక ఆటగాళ్లు లేకపోవడం దారుణమని.. అంతేకాక‌ హైదరాబాద్ జట్టుకు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప‌ట్టుబ‌డిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద్రాబాద్ జ‌ట్టులో స్థానిక ప్లేయర్స్ లేకపోవడం బాధ‌క‌ర‌మ‌న్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టులోకి స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని.. లేకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. జట్టులో హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం లేనప్పుడు.. జ‌ట్టు పేరు వెంటనే మార్చాలంటూ ఫైర్ అయ్యారు.

ఇదిలావుంటే.. ఈ నెల 18న జ‌రిగిన‌ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ స్థానికి ఆటగాడిని కొనుగోలు చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష‌య‌మై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఒక్క హైదరాబాదీ ఆట‌గాడు లేకపోవడం బాధాక‌ర‌మ‌ని అన్నారు.


Next Story