గ‌త‌కొద్ది రోజులుగా పెట్రోలు ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీట‌ర్ పెట్రోల్ భాగ్య‌న‌గ‌రంలో రూ.100 కి చేరువ అయ్యింది. ఇలాంటి త‌రుణంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు జ‌నాన్ని మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో కొన్ని సెట్టింగుల‌తో కొల‌తల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతూ డ‌బ్బులు దండుకోవ‌డం చూశాం కానీ.. రాజేంద్ర న‌గ‌ర్‌లో క‌ల్తీ పెట్రోల్ క‌ల‌క‌లం రేగింది. ఉప్ప‌ర్ ప‌ల్లిలోని బ‌డేమియా పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బ‌దులుగా నీళ్లు పోస్తున్నారు నిర్వాహ‌కులు. వాహ‌నాదారులు ఈ విష‌యాన్ని గుర్తించి పెట్రోల్ బంక్ నిర్వాహ‌కుల‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.

బాటిళ్ల‌లో పెట్రోల్ పోయించుకుని ప‌రిశీలిస్తే.. దాదాపు సగం నీళ్లు ఉంటే.. మిగ‌తా సగం పెట్రోల్ క‌నిపిస్తోంది. నీళ్లతో కలిసిన పెట్రోల్ పోయడంతో తమ వాహనాలు పాడైపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ కల్తీకి పాల్పడుతున్న బడే మియా పెట్రోల్ పంప్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు.

విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని పెట్రోల్‌ను పరిశీలించారు. పెట్రోల్‌లో నిళ్లు కలపడాన్ని నిర్ధారించుకున్నారు. బంక్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story