సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు.. ఆర్థికసాయం అందజేత
Ministers Visits For Saidabad Girl Family. నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి
By Medi Samrat Published on
16 Sep 2021 4:58 AM GMT

నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ గురువారం పరామర్శించారు. దుఃఖంలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులను మంత్రులు ఓదార్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల రాకతో పోలీసులు సింగరేణి కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే.. సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
Next Story