Hyderabad: మణికొండలో జలవిలయం..అర్ధరాత్రి పగిలిన తాగునీటి పైప్‌లైన్ (Video)
హైదరాబాద్‌లోని మణికొండ వాసులకు మంగళవారం తెల్లవారుజామున ఊహించని షాక్ తగిలింది.
By - Knakam Karthik |
Hyderabad: మణికొండలో జలవిలయం..అర్ధరాత్రి పగిలిన తాగునీటి పైప్‌లైన్ (Video)
హైదరాబాద్‌లోని మణికొండ వాసులకు మంగళవారం తెల్లవారుజామున ఊహించని షాక్ తగిలింది. సింగూర్ రిజర్వాయర్ నుండి నగరానికి తాగునీటిని సరఫరా చేసే భారీ పైపులైన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో.. ఆ ప్రాంతంలో 'మినీ సునామీ' లాంటి దృశ్యాలు కనిపించాయి.
తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో పైపులైన్ భారీ శబ్దంతో పగిలిపోయింది.సెకన్ల వ్యవధిలోనే లక్షలాది లీటర్ల నీరు ఎంప్లాయీస్ కాలనీ, శివ సాయి కాలనీలను ముంచెత్తింది. అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లు నీట మునిగాయి. పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో తేలియాడటంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా (HYDRAA) బృందాలు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పైపులైన్ పగిలిన ధాటికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. అదృష్టవశాత్తూ సమీపంలోని పండెన వాగు వరద నీటిని తనలోకి మళ్లించుకోవడంతో పొరుగు కాలనీలు మునిగిపోకుండా భారీ ప్రమాదం తప్పింది.
#Hyderabad:A major #waterpipeline burst past midnight on #Manikonda Pipeline Road, flooding the #cellars of nearby #apartment complexes.Within just five minutes, water levels rose up to six feet, #submerging 8 #cars and several #bikes, causing extensive #damage.#HYDRAA and… pic.twitter.com/xBhqP9R6jB
— NewsMeter (@NewsMeter_In) February 17, 2026