మెట్రోలో సాంకేతిక సమస్య.. 20 నిమిషాల పాటు అంతా..

Metro Train Stuck In JNTU. సాంకేతిక సమస్యతో మెట్రో రైల్‌ కొద్ది సేపు నిలిచిపోయింది. బుధవారం మియాపూర్‌-ఎల్‌బీనగర్ మ‌ధ్య

By Medi Samrat  Published on  18 Nov 2020 5:28 AM GMT
మెట్రోలో సాంకేతిక సమస్య.. 20 నిమిషాల పాటు అంతా..

సాంకేతిక సమస్యతో మెట్రో రైల్‌ కొద్ది సేపు నిలిచిపోయింది. బుధవారం మియాపూర్‌-ఎల్‌బీనగర్ మ‌ధ్య న‌డుస్తున్న‌ మెట్రోరైల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో జేఎన్టీయూ మెట్రో స్టేషన్‌ సమీపంలో రైల్‌ నిలిచిపోయింది. ఉదయం వేళ కావడంతో మెట్రోలో రద్దీ అధికంగా ఉండడం, అందరూ ఉద్యోగ, ఇతర అవసరాల నిమిత్తం మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు. దీంతో ఆకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

సుమారు 20 నిమిషాల పాటు ప్రయాణికులు రైల్‌లోనే ఉండిపోయారు. దీంతో పలువురు తమ ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో బాధను వ్యక్తం చేశారు. రైలు ఆకస్మాత్తుగా ఆగిపోవడానికి గ‌ల‌ కారణాల‌ను తెలుసుకునేందుకు మెట్రో అధికారులు రంగంలోకి దిగారు. మెట్రో రైళ్లు ఇటీవల తరచూ ఆగిపోతుండడం వల్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


Next Story