కాసేప‌ట్లో మెస్సీ మ్యాచ్‌.. కోలాహలంగా ఉప్పల్ స్టేడియం..!

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ తన గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ చేరుకున్నాడు. కోల్‌కతాలో ఈవెంట్ అస్తవ్యస్తంగా ప్రారంభమైన నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉత్కంఠ నెల‌కొంది.

By -  Medi Samrat
Published on : 13 Dec 2025 7:43 PM IST

కాసేప‌ట్లో మెస్సీ మ్యాచ్‌.. కోలాహలంగా ఉప్పల్ స్టేడియం..!

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ తన గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ చేరుకున్నాడు. కోల్‌కతాలో ఈవెంట్ అస్తవ్యస్తంగా ప్రారంభమైన నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉత్కంఠ నెల‌కొంది. మెస్సితో పాటు అత‌ని సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెస్సీకి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి షేక్‌హ్యాండ్ ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం 100 మంది ప్రత్యేక ఆహ్వానితులతో మీట్ అండ్ గ్రీట్ ముగిసింది. క్యూఆర్ కోడ్ కేటాయించిన 250 మందితో ఫొటో సెషన్ కొనసాగుతోంది. అనంతరం లియోనెల్ మెస్సితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఉప్పల్ స్టేడియంకు బయలుదేరనున్నారు.

సాయంత్రం 7.50 గంటలకు ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే మెస్సీ అభిమానులు వేలల్లో ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు స్టేడియంలో ప్రఖ్యాత సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ మ్యూజికల్ ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో మెస్సి జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ చివరి 5 నిమిషాలు మైదానంలోకి మెస్సి, రేవంత్ రెడ్డి దిగి ప్రేక్షకులను అలరించనున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉండనుంది.

Next Story