ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్

Meil Company Produce Free Oxygen Cylinders To Hospitals. మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ ఉచితంగా ఆక్సిజన్

By Medi Samrat  Published on  8 May 2021 12:35 PM GMT
ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్

మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ ఉచితంగా ఆక్సిజన్ సరఫరాకు ముందుకు వచ్చింది. హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రులు మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌ను ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని కోరాయి. వారి కోరిక మేరకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో చెప్పారు. వారు చెప్పినట్లుగానే సహాయం చేయడానికి ఎంఈఐఎల్ ముందుకు వచ్చింది. సరోజిని దేవి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను, అపోలో హాస్పిటల్స్ కు ప్రతిరోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది.

భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. డి.ఆర్.డి.వో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 3.50 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయనుంది. భద్రాచలం ఐ.టి.సి నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతి చేసుకోవడమే కాకుండా.. స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతికి ఎంఈఐఎల్ అంగీకారం తెలిపింది. క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల తయారీకి కూడా ఎంఈఐఎల్ సంస్థ సిద్ధమైంది.


Next Story