సాలార్ జంగ్ మ్యూజియంలో మూడు రోజుల పాటు లైవ్ ఆర్ట్ క్యాంప్
Meet the 75 artists creating live art at Salar Jung Museum. సాలార్ జంగ్ మ్యూజియంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా నిర్వహిస్తున్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2022 8:03 PM ISTహైదరాబాద్ : సాలార్ జంగ్ మ్యూజియంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ఆర్ట్ క్యాంప్ 2022 లో 75 మంది కళాకారులు పాల్గొంటూ ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, JNAFAU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, SV కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సహా నగరంలోని వివిధ కళాశాలలు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఉన్నారు. "మేరా భారత్ మహాన్" అనే థీమ్‌పై పెయింటింగ్ పోటీలు చేస్తున్నారు. న్యూస్‌మీటర్ బృందం ఎగ్జిబిషన్‌ను సందర్శించి కొంతమంది కళాకారులతో మాట్లాడింది.
53 సంవత్సరాల కవిత కులకర్ణి.. ఈ ఈవెంట్ లో పాల్గొంటున్న కళాకారులలో పెద్ద వయసు ఉన్న మహిళ. ఆమె SV కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సులో చేరిన ఆమె తరగతిలో అత్యంత పెద్ద విద్యార్థి. ఆదివారం ఆర్ట్ క్యాంపు రెండవ రోజున మేము ఆమెను కలిశాం. ఆమె తన ఆర్ట్‌వర్క్ ను సగం పూర్తీ చేశారు. సాంస్కృతిక వైవిధ్యం గురించి ఆమె తన ఆర్ట్ ద్వారా చెబుతున్నారు. "నేను భారతదేశంలోని వివిధ సంస్కృతులను వర్ణించే యాక్రిలిక్ ఆధారిత కళపై పని చేస్తున్నాను" అని ఆమె చెప్పారు.
మరో విద్యార్థి.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థి శివకుమార్.. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేల చిత్రాన్ని తయారు చేస్తున్నారు. డార్క్ బ్యాగ్డ్రాప్ లో సావిత్రీబాయి చిత్రపటాన్ని చిత్రిస్తున్నాడు. ఆమె పక్కనే జ్యోతిరావు చిన్న విగ్రహం వంటి బొమ్మ, చీకటి మధ్య కాంతి వంటిది ఉంది.
"నేను వారిద్దరినీ ఎప్పుడూ ఆరాధిస్తూ వచ్చాను. సమాజంలో స్త్రీల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని నేను భావిస్తున్నాను," అని శివకుమార్ అన్నారు. "సావిత్రిబాయి లేకుండా, బహుశా భారతదేశంలో మహిళల హక్కులు అభివృద్ధి చెందవు." అని అన్నాడు. శివకుమార్ పక్కన, రాజశేఖర్ కూడా ఆహ్లాదకరమైన పోర్ట్రెయిట్ కోసం పని చేస్తున్నాడు. పల్లెటూరి వాతావరణం గురించి.. రాజశేఖర్ తన కాన్వాస్‌పై రకరకాల రంగులను ఉపయోగిస్తున్నాడు. అతను బ్యాక్‌గ్రౌండ్‌కి చాలా లేత బంగారు గోధుమ రంగును ఉపయోగించాడు. అతని పెయింటింగ్‌లు స్త్రీలు, బాలికలతో నిండి ఉన్నాయి. ఇద్దరు మహిళలు అనేక దక్షిణ భారత పండుగల సమయంలో చేసినట్లుగా వారి ముఖాలపై హల్దీని పూయడం చూడవచ్చు. ఇతర సాంప్రదాయ తెలుగు డిజైన్లు కూడా అందులో ఉన్నాయి. "నేను మహబూబ్‌నగర్‌కు దగ్గరగా ఉన్న గ్రామం నుండి వచ్చాను. విలక్షణమైన గ్రామ సంస్కృతి మన దేశాన్ని గొప్పగా మార్చగలదని నేను నిజంగా అనుకుంటున్నాను" అని రాజశేఖర్ అన్నారు.
మూగవాడైన యశ్ వర్మ.. రెగల్ గ్రీన్ పెయింటింగ్ వేస్తున్నాడు. ఎర్రకోట ఎలా ఉంటుందో దాని రూపురేఖలను రూపొందించడానికి అతను తెల్లటి యాక్రిలిక్ పెయింట్‌ను ఉపయోగిస్తున్నాడు. యష్ మాతో టైపింగ్ రూపంలో మాట్లాడాడు.. "నేను భారతదేశంలో గొప్ప పచ్చదనాన్ని చూపించడానికి ఆకుపచ్చని ఉపయోగిస్తున్నాను. శిబిరం ముగిసేలోపు దానిని పూర్తీ చేయాలని నేను ఆశిస్తున్నాను." అని చెప్పుకొచ్చాడు.
మరో కళాకారిణి.. ప్రసూన ఆకుడి కేవలం వాటర్ కలర్స్‌తో మాత్రమే సాధించగలిగే రంగుల మిశ్రమం సృష్టించే లక్ష్యంతో ఉంది. ఆమె యాక్రిలిక్ పెయింట్స్ ఉపయోగిస్తోంది. "ఇది ఒక రకమైన ప్రయోగం. నేను దీన్ని మొదటిసారి చేస్తున్నాను" అని ఆమె చెప్పింది. ఆమె వారణాసి ఘాట్‌లపై చిత్రాన్ని చిత్రిస్తోంది.
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు, తెలంగాణ ఆర్ట్ ఫోరం కన్వీనర్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ శిబిరం అనేక మంది కళాకారులను ఏకతాటిపైకి తీసుకొచ్చిందన్నారు. మ్యూజియం ద్వారా కళాకారులందరికీ చిన్నపాటి గౌరవ వేతనం చెల్లిస్తున్నామని, స్వాతంత్య్ర దినోత్సవం రోజున మ్యూజియంలోని పలు ప్రాంతాల్లో కళాఖండాలన్నింటినీ ప్రదర్శిస్తామని తెలిపారు.