హైదరాబాద్‌లో వైద్యం వికటించి ఆరు నెలల శిశువు మృతి

హైదరాబాద్‌ సన్‌సిటీ పరిధిలోని క్రియాన్స్ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఆరు నెలల పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 5:20 PM IST

Hyderabad News, Crime, Medical Negligence, Infant Death, Expired Medicine

హైదరాబాద్‌లో వైద్యం వికటించి ఆరు నెలల శిశువు మృతి

హైదరాబాద్‌ సన్‌సిటీ పరిధిలోని క్రియాన్స్ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఆరు నెలల పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. రాము అనే ఆరు నెలల శిశువుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే, వైద్యులు గడువు ముగిసిన (Expired) మందులు ఇవ్వడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మందు వేసిన కొద్దిసేపటికే బాబు ఆరోగ్యం విషమించి మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story