పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముస్లిం సోదరులకు అందించారు. ఖైరతాబాద్ జోన్ ప్రేమ్ నగర్ మజీద్ ఈ కుతుబ్ షాహీ వద్ద నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గిఫ్ట్ ప్యాక్ లను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు, క్రిస్మస్ వేడుకలకు, రంజాన్ పండుగకు, పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మజీద్ కమిటీ సభ్యులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.