రామ్‌గోపాల్‌పేట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Massive Fire breaks out Ram Gopal Pate.సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2023 7:43 AM GMT
రామ్‌గోపాల్‌పేట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న‌ల్ల‌గుట్ట‌లోని డెక్క‌న్ నైట్ వేర్ స్టోర్‌లో భారీగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. రెండు ఫైరింజ‌న్ల‌తో అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఐదో అంత‌స్తులో ముగ్గురు చిక్కుకోగా వారిని ర‌క్షించారు. కాగా.. నాలుగో అంత‌స్తులో ఒక‌రు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకొని ఉంది. ఇంకా ఆ భ‌వ‌నంలో ఎంత మంది చిక్కుకున్నారు అన్న విష‌యాలు తెలియ‌రాలేదు. డెక్క‌న్ నైట్ వేర్ స్టోర్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో స్థానికులు భ‌యభ్రాంతుల‌కు గురైయ్యారు. అక్క‌డి నుంచి దూరంగా ప‌రుగులు పెట్టారు. షాపులో ఉన్న వ‌స్తువులు ఖాళీ పోవ‌డంతో భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లు షాపు య‌జ‌మాని చెబుతున్నాడు. కాగా.. మంట‌లు ఎలా చెల‌రేగాయి అన్నది ఇంకా తెలియ‌రాలేదు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిందా..? ఇంకా ఏమైన కార‌ణం ఉందా..? అన్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేస్తున్నారు.

Next Story
Share it