రాజేంద్ర‌న‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.శాస్త్రీపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2023 3:16 AM GMT
Rajendranagar Fire Accident,

మంటల్లో కాలిపోతున్న డీసీఎం వాహ‌నాలు

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. శాస్త్రీపురంలోని మీర్ అలం ఫిల్డ‌ర్ స‌మీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. భారీగా ఎగిసిప‌డుతున్న మంట‌లను చూసి స్థానికులు భ‌య‌బాంత్రుల‌కు గురి అయ్యారు. పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు.

రెండు ఫైరింజ‌న్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్ వ‌స్తువులు ఉండ‌డంతో భారీగా మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. గోదాంలో నిలిపి ఉంచిన రెండు డీసీఎం వాహ‌నాలు ద‌గ్థం అయ్యాయి. ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది. ప్ర‌మాద స‌మ‌యంలో గోదాంలో ఎవ‌రూ లేన‌ట్లుగా తెలుస్తోంది. మంట‌లు ఎలా అంటుకున్నాయి అన్న సంగ‌తి ఇంకా తెలియ‌రాలేదు. షార్ట్ స‌ర్య్కూట్ కారణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు బావిస్తున్నారు. భారీగా మంట‌లు ఎగిసిప‌డుతుండ‌డంతో స్థానికుల‌కు అక్క‌డి నుంచి కాస్త దూరంగా పంపించారు.

కాగా.. ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గురువారం సికింద్రాబాద్‌లోని స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

Next Story