Viral Video : చార్మినార్ పైభాగంలో ఏం జ‌రుగుతుంది.?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో చార్మినార్‌ కు ఉన్న వంపు కిటికీల గుండా ఒక వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నట్లు కనిపించాడు

By M.S.R  Published on  5 Oct 2024 9:34 AM IST
Viral Video : చార్మినార్ పైభాగంలో ఏం జ‌రుగుతుంది.?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో చార్మినార్‌ కు ఉన్న వంపు కిటికీల గుండా ఒక వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నట్లు కనిపించాడు. కింద ఉన్న వ్యక్తులు వీడియోను చిత్రీకరించి, దానిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అది విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి కిటికీల గుండా నడుస్తూ ఉన్నప్పుడు మరొక వ్యక్తి మినార్లలో ఒకదానిపై నిలబడి చూస్తున్నాడు. అప్పటికే అలాంటి స్టంట్స్ చేస్తూ నాలుగు కిటికీలు దాటిన వ్యక్తి, చివరికి ఓ చోట కూర్చుండి పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని, కేసు నమోదు చేయలేదని చార్మినార్ పోలీసులు తెలిపారు.

చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అక్కడి పని చేసే కార్మికుల్లో ఒకరు అయ్యుండవచ్చని చార్మినార్ పోలీసు అధికారి తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు చార్మినార్ వంటి స్మారక కట్టడాలను కూడా వాడుకుంటూ ఉన్నారని విమర్శించారు. ఒకవేళ పని చేసే వ్యక్తి అయితే అతడికి సరైన సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ మ‌ర‌కొంద‌రు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Next Story