నగ్నంగా కనిపించి రెచ్చగొట్టింది.. ఆ తర్వాత
Man trapped women in Hyderabad.ఓ యువతి వాట్సాప్ ద్వారా నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్వించి తనను ఎంతగానో నమ్మిన వ్యక్తిని దారుణంగా మోసం చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 14 March 2021 11:07 AM ISTఈ మద్య మోసాలు పలు చిత్రాలుగా జరుగుతున్నాయి. టెక్నాలజీనీ వాడుకొని ఎదుటి మనిషిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. గత కొంత కాలంగా సైబర్ నేరాలే ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ యువతి వాట్సాప్ ద్వారా నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్వించి తనను ఎంతగానో నమ్మిన వ్యక్తిని దారుణంగా మోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్ ద్వారా ఓ పరిచయం అయ్యింది. తర్వాత మెసేంజర్‌లో నాలుగు రోజులు చాట్ చేసిన అనంతరం వాట్సాప్ నంబర్ అడిగితే ఇచ్చాడు. ఆ తర్వాత మూడు రోజులు వాట్సాప్‌కాల్‌లో మాట్లాడిన సదరు యువతి ఓ రోజు నగ్నంగా వీడియోకాల్ చేసింది. అంతే ఒక్కసారే ఆ వ్యక్తి మైకంలో మునిగిపోయాడు.
ఆ సమయంలోనే అతన్ని కూడా నగ్నంగా ఉండాలని కోరింది.. అంతే మనోడు కూడా నగ్నంగా మారి పోయాడు.. ఆ దృశ్యాలను స్క్రీన్ రికార్డు చేసింది. తర్వాత ఆమె నిజ స్వరూపం చూపించింది. యూట్యూబ్‌లో సేవ్ చేసిన ఆ వీడియో లింక్‌ను బాధితుడి వాట్సాప్ నంబర్‌కు పంపింది. దాంతో బాధితుడు కుయ్యో మొర్రో అన్నాడు. బాధితుడు ఆమెకు ఫోన్ చేయగా రూ.50వేలు ఇస్తే తొలగిస్తానని చెప్పడంతో నగదు బదిలీ చేశాడు.
తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్లుగా గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి ఓ యువతి మీ పైనా ఫిర్యాదు చేసిందని, నగ్నంగా ఉన్న ఆమె వీడియోను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని, మీపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. మరింత భయపడ్డ ఆ వ్యక్తి అడిగినట్లు రూ.1.5 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసి కేసు నమోదు కాకుండా చూడాలని కోరాడు. అలాగే వేధింపులు ఎక్కువ కావడంతో ఇక లాభం లేదని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.