హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య
Man Brutally murdered in Hyderabad.హైదరాబాద్ నగరంలో యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. గురువారం అర్థరాత్రి
By తోట వంశీ కుమార్ Published on
14 Jan 2022 8:06 AM GMT

హైదరాబాద్ నగరంలో యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. గురువారం అర్థరాత్రి దాటాక హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. షోయబ్ ఖాద్రి(25) అనే యువకుడిపై ఫస్ట్ లాన్సర్ సర్ కట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. రాత్రి 2గంటల ప్రాంతంలో షోయబ్ ఖాద్రి చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళ్తుండగా.. దుండగులు అతడి కారును అడ్డుకున్నారు. అతడిని కారులోంచి బయటకు లాగి.. తమవెంట తెచ్చుకున్న కత్తులతో నరికి చంపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షోయబ్ ను చంపడానికి పాత పగలు ఏవైనా కారణమా..? మరేమన్న ఇతర కారణాలు ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story