చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం

Mahmood Ali inaugurates Chandrayanguta flyover.హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్‌ను రాష్ట్ర హోంశాఖ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 7:48 AM GMT
చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శ‌నివారం ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్భ‌రుద్దీన్ ఓవైసీతో క‌లిసి మంత్రి రిబ్బ‌న్ క‌ట్ చేశారు. అనంత‌రం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. ముఖ్యంగా రాజ‌ధాని హైద‌రాబాద్‌లో అన్ని ర‌కాల మౌళిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న కోసం ప్ర‌త్యేక దృష్టి సారించార‌న్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా అవసరమైన చోట ప్రభుత్వం ఫ్లైఓర్లను నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. ఎస్ఆర్‌డీపీ ప‌థ‌కం కింద దాదాపు 8 వేల కోట్ల రూపాయ‌లకు పైగా నిధుల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్పన చేసిన‌ట్లు చెప్పారు.

చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్‌ను రూ.45.29 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం 4 లైన్ల‌ను రెండు వైపుల 674 మీట‌ర్ల పొడ‌వుతో నిర్మించారు. దీని వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య చాలా వ‌ర‌కు తీరుతుంది. కందిక‌ల్ గేట్‌, బ‌ర్కాస్ జంక్ష‌న్ల వ‌ద్ద ట్రాఫిక్ ఆగ‌కుండా నేరుగా ఈ ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి ప్ర‌యాణించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఉన్న ఫ్లై ఓవ‌ర్ అప్రోచ్ చివ‌రిలో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు ఈ ఫ్లై ఓవ‌ర్‌ను పొడిగించారు. పైవంతెనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, వరంగల్‌, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సుమారు 10 నిమిషాల సమయం ఆదా కానుంది. వాస్త‌వానికి ఫ్లై ఓవర్‌ గత మంగళవారమే ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది.

Next Story