వాహనదారులు ఇకపై చలానాలు ఒక్కటి ఉన్నా టెన్షన్ పడాల్సిందే
Madhapur Police Seized Bike For Pending Challans. వాహనదారులు తమ వాహనాలపై పడ్డ చలానాలను లైట్ గా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు
By Medi Samrat Published on 2 Aug 2021 1:44 PM IST
ఆదివారం పర్వత్ నగర్ చౌరస్తాలో నిఖిలేష్ అనే న్యాయవాది బైక్ ను ఒక చలానా పెండింగ్ ఉందని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు బైక్ ని సీజ్ చేశారు. కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ తొగరి బైకును ఆదివారం పర్వత్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని ఎస్‌ఐ మహేంద్రనాథ్ కోరారు. చలనా కట్టేందుకు న్యాయవాది నిరాకరించారు. దీంతో పోలీసులు బైక్ ను సీజ్ చేశారు. ఒక్క చలానాకే బండిని ఎలా సీజ్ చేస్తారని న్యాయవాది అడగ్గా మాదాపూర్ ట్రాఫిక్ సీఐ క్లారిటీ ఇచ్చారు. రూల్స్ ప్రకారమే బండి సీజ్ చేశామని స్పష్టం చేశారు. ఒక్క చలానా పెండింగ్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేయొచ్చని తెలిపారు. చలానాలు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్లకు ఇది షాకింగ్ అంశమే..! కాబట్టి పెండింగ్ లో ఉన్న చలానాలు కట్టేయండి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లే సమయంలో బండిని పోలీసులు సీజ్ చేస్తే మాత్రం బాధపడాల్సి ఉంటుంది.