పరారీలో నవదీప్ అన్న పోలీసులు.. హైదరాబాద్ లోనే ఉన్నానన్న హీరో నవదీప్

హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు తెర మీదకు వచ్చింది.

By Medi Samrat  Published on  14 Sept 2023 7:08 PM IST
పరారీలో నవదీప్ అన్న పోలీసులు.. హైదరాబాద్ లోనే ఉన్నానన్న హీరో నవదీప్

హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు తెర మీదకు వచ్చింది. డ్రగ్స్ తీసుకున్న వారిలో హీరో నవదీప్ ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నవదీప్ ఫ్రెండ్ రాంచంద్‌ను అరెస్ట్ చేశామని.. రాంచంద్‌తో పాటు నవదీప్ కూడా డ్రగ్స్ కొన్నట్లు గుర్తించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లు వివరాలు తెలిశాయని సీవీ ఆనంద్ తెలిపారు. తాజాగా మదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని.. అందులో ఐదుగురిని అరెస్టు చేసి వారివద్ద ఉన్న సెల్ ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుండి వచ్చిందని అన్నారు. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. నైజీరియన్లు వీసా గడవు ముగిసినా దేశంలోనే ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని.. మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేష్ రావు అరెస్ట్ చేశామన్నారు. హీరో నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే వారిని పట్టుకుంటామని అన్నారు.

అయితే ఈ వ్యవహారంపై నవదీప్ స్పందించారు. ఈ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎటు పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. ఈ కేసులో నార్కోటిక్స్ అధికారులు నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గుడి మల్కాపురం పోలీసులతో కలసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story