రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
Liquor Shops Closed For Next Two Days. గ్రేటర్ హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా మద్యం దుకాణాలకు సెలవు
By Medi Samrat Published on
23 July 2022 2:30 PM GMT

గ్రేటర్ హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా మద్యం దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈస్ట్, వెస్ట్ జోన్ పరిధిలో ఆదివారం మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం రాత్రి 11 గంటల తర్వాత మూసివేయనున్నారు. సౌత్ జోన్‌లో మాత్రం రెండు రోజుల పాటు వైన్ షాపులతో పాటుగా బార్లు, క్లబ్బులు సహా అన్నింటినీ మూసివేయాలని ఆదేశించారు. సౌత్ జోన్‌లో ఆదివారం, సోమవారం రెండు రోజులు మూసివేయాలని, శనివారం రాత్రి మూసివేసిన తర్వాత మంగళవారం తిరిగి తెరుచుకోవాలని సర్క్యులర్ లో తెలిపారు.
Next Story