Hyderabad: భారీ వర్షం.. కూలిన ఎల్బీ స్టేడియం బౌండరీ గోడ

హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్‌బీ స్టేడియం బౌండరీ గోడలో కొంత భాగం కూలిపోయింది.

By అంజి  Published on  20 Aug 2024 12:49 PM IST
LB Stadium, boundary wall collapses, rains, Hyderabad

Hyderabad: భారీ వర్షం.. కూలిన ఎల్బీ స్టేడియం బౌండరీ గోడ

హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్‌బీ స్టేడియం బౌండరీ గోడలో కొంత భాగం కూలిపోయింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్టేడియం బౌండరీ గోడ కూలడంతో పాత సీసీఎస్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన కొన్ని పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఓ చెట్టు కూడా కూలిపోయింది.

హైదరాబాద్‌లో వర్షాలు

నిన్న అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 170.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 126.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవలి భారీ వర్షపాతం తీవ్రమైన వేడి, తేమ నుండి అవసరమైన ఉపశమనాన్ని అందించినప్పటికీ, ఇది ప్రజలకు సమస్యలను కూడా తెచ్చింది.

హైదరాబాద్ అంతటా వరద నీరు ఎక్కడికక్కడ నిలిచి పోవడం ప్రధాన సమస్యగా మారింది, అనేక లోతట్టు ప్రాంతాలలో రోడ్లు మునిగిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం, ప్రయాణికుల అసౌకర్యానికి దారితీసింది.

Next Story