రష్యన్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-V మూడో విడత దిగుమతిలో బాగంగా 56.6 టన్నుల వ్యాక్సిన్లు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అంతకుముందు మొదటి విడతలో భాగంగా మే1న 1.5 లక్షల డోసులు వచ్చాయి. రెండో విడతలో మే 16న 60 వేల డోసులు వచ్చాయి. తాజాగా నేడు 3 మిలియన్ల డోసులు హైదరాబాద్‌కు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన కరోనా వ్యాక్సిన్లలో ఈ 56.6 టన్నులే అతిపెద్ద దిగుమతి.
ఇదిలావుంటే.. స్పుత్నిక్-V వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన పరిస్థితులలో నిల్వచేయడం అవసరం. వీటిని మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. అందుకే ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సెంటర్ లో వీటిని నిల్వచేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. అలాగే.. భారతదేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా.. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సెంటర్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది.