హైటెక్‌ సిటీ కియా షోరూంలో క్యాథెరిన్, జానీ మాస్టర్ సంద‌డి

KIA EV6 Launched By Catherine Tresa. కియా ఎల‌క్ట్రిక్ కారు ఈవీ6 ను హైటెక్‌ సిటీలో ఉన్న ఆటోమోటివ్‌ కియా షోరూంలో నేడు

By Medi Samrat  Published on  27 May 2022 2:21 PM GMT
హైటెక్‌ సిటీ కియా షోరూంలో క్యాథెరిన్, జానీ మాస్టర్ సంద‌డి

కియా ఎల‌క్ట్రిక్ కారు ఈవీ6 ను హైటెక్‌ సిటీలో ఉన్న ఆటోమోటివ్‌ కియా షోరూంలో నేడు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి క్యాథెరిన్ ట్రెసా, సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తో పాటుగా కియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు దీనిని ప్రత్యక్షంగా చూసేందుకు కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ప్రదర్శన‌కు ఉంచ‌నున్నారు. ఇక‌ మూడు లక్షల రూపాయల టోకెన్‌ మొత్తం చెల్లించడం ద్వారా ఈవీ 6 ను ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. 2022లో భారత్ లో ప్రీమియం ఆఫరింగ్‌గా మొద‌టి 100 మంది వినియోదారులకు ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022లో విడుదల చేయనున్నారు.

కియా ఈవీ6 అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటు.. ఏడబ్ల్యుడీ వేరియంట్‌లో 325పీఎస్‌ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది.

కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసెంజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

కియా ఈవీ 6 వాహనం భారతదేశంలో ఐదు రంగులలో ల‌భించ‌నుంది. మూన్‌స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూ –లో లభిస్తుంది.

















Next Story