ఖమేనీ హత్య అమానుషం.. అసదుద్దీన్ ఒవైసీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

By -  Medi Samrat
Published on : 1 March 2026 6:40 PM IST

ఖమేనీ హత్య అమానుషం.. అసదుద్దీన్ ఒవైసీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అత్యంత అనైతికమని, చట్టవిరుద్ధమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే.. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులకు దిగడాన్ని ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ వైమానిక దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 200 మందికి పైగా చనిపోయారని.,ముఖ్యంగా ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో ఏకంగా 108 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరాన్‌పై దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో జరుగుతున్న పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలపైనా ఒవైసీ స్పందించారు.

Next Story