JublieeHillsBypoll: మాగంటి సునీతకు బి-ఫామ్ అందజేసిన కేసీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ బి-ఫామ్ అందజేశారు.

By -  Knakam Karthik
Published on : 14 Oct 2025 5:25 PM IST

Hyderabad News, JublieeHillsBypoll, Maganti Sunitha, Kcr

JublieeHillsBypoll: మాగంటి సునీతకు బి-ఫామ్ అందజేసిన కేసీఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ బి-ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ. 40 లక్షల రూపాయలు చెక్కు ను అందించారు. కాగా రేపు సాదాసీదాగా మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 19న భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్‌ను మాగంటి సునీత దాఖలు చేయనున్నారు.

ఈ సందర్భంగా.. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story