పాల్ సార్ వచ్చారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడారు

KA Paul About GHMC Elections. కె.ఏ.పాల్ ఈయనను మరచిపోని తెలుగు వ్యక్తి అంటూ ఉండరు. ఎంత వివాదాస్పదమయ్యాయో..

By Medi Samrat
Published on : 30 Nov 2020 3:57 PM IST

పాల్ సార్ వచ్చారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడారు

కె.ఏ.పాల్ ఈయనను మరచిపోని తెలుగు వ్యక్తి అంటూ ఉండరు. ఎంత వివాదాస్పదమయ్యాయో.. అంతే గొప్ప ఎంటర్టైన్మెంట్ ను కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో..! ఈ మధ్య చాలా బిజీగా ఉన్న ఆయన మరో సారి వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం ఎటువంటి వివాదం లేదనుకోండి. ఆయన ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అలాగని ఆయన ఏదో పార్టీకి ప్రచారం చేస్తున్నారేమోనని అనుకోకండి. ఆయన ఓటు హక్కు విషయమై ప్రజలకు పలు సూచనలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. డబ్బుకు, ప్రలోభాలకు లోనుకావద్దని సూచించారు. ఈ ఎన్నికల ద్వారా మార్పును తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతోంది. ఎన్నికలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు తమ సందేశాన్ని ఇస్తున్నారు.



Next Story