టీవీ9 ఆఫీస్‌లో రవి ప్రకాష్..!

Journalist Ravi Prakash Went to TV9 Office. ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ఊహించని విధంగా టీవీ9 ఆఫీస్‌లో కనిపించారు.

By Medi Samrat
Published on : 21 Feb 2023 4:02 PM IST

టీవీ9 ఆఫీస్‌లో రవి ప్రకాష్..!

ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ఊహించని విధంగా టీవీ9 ఆఫీస్‌లో కనిపించారు. మంగళవారం ఆయన టీవీ9 కార్యాలయానికి వచ్చారు. టీవీ9 ఛానెల్ వ్యవస్థాపక డైరెక్టర్‌ అయిన రవి ప్రకాష్.. అనుకోని కారణంగా టీవీ9 నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే తన విజిట్ వెనుక కారణం ఏంటో రవి ప్రకాష్ వివరించారు. పోలీసులతో పాటు వచ్చిన రవి ప్రకాష్.. కార్యాలయం లోపలికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీవీ9లో అకౌంట్స్ సంబంధిత సమాచారం కోసమే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.

తన ఆడిటర్‌ను కొంత మంది పోలీసుల్ని భద్రతగా తీసుకుని టీవీ9 కొత్త కార్యాలయానికి వచ్చిన రవి ప్రకాష్ నేరుగా లోపలికి వెళ్లిపోయారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన తాను టీవీ9 అకౌంట్స్ చెక్ చేయడానికి వచ్చానని మీడియాకు చెప్పి వెళ్లారు. అనుకోని విధంగా ఆయన అక్కడ కనిపించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.




Next Story