హైదరాబాద్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి. విశ్వ ప్రసాద్ స్థానంలో ఐపీఎస్ అధికారి డి.జోయల్ డేవిస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జోయల్‌డేవిస్ సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్‌గా ఉండగా.. ఐపీఎస్ బదిలీలలో భాగంగా డేవిస్‌ను హైదరాబాద్ ట్రాఫిక్‌కు బదిలీ చేశారు.
జోయల్ డేవిస్ గతంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. సెంట్రల్ వెస్ట్ జోన్‌ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి)గా కూడా పనిచేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సమస్యను తగ్గించాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.