మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చిరుత కనిపించిందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులతో కలిసి వెళ్లిన పోలీసులు, చిరుత కోసం తీవ్రంగా గాలించారు. చిరుత పాదముద్రల కోసం అటవీ సిబ్బంది గాలించారు.
శనివారం ఉదయం అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. జంతువు కదలికలను బట్టి అది చిరుత కాదని అడవి పిల్లి అని చెప్పడంతో మియాపూర్ వాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిరుత పులికి సంబంధించిన విజువల్స్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో స్పాట్ కు చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో చీకట్లో గాలింపు చర్యలను నిలిపేసిన అధికారులు. ఆ తర్వాత తమ పనిని మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ సంచరించింది అడవి పిల్లిగా తేల్చారు.