Hyderabad: మతాంతర పెళ్లి జంటపై గుంపు దాడి.. నలుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో మతాంతర వివాహితులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

By అంజి  Published on  31 March 2024 7:40 AM IST
interfaith couple, assault, Hyderabad, Crime

Hyderabad: మతాంతర పెళ్లి జంటపై గుంపు దాడి.. నలుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో మతాంతర వివాహితులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వైరల్ ఫుటేజ్‌లో ముస్లిం పురుషుల గుంపు బురఖాలో అతని భార్యతో పాటు శిశువును తీసుకువెళుతున్న వ్యక్తిని అడ్డగించింది. ముస్లిం యువతితో చార్మినార్‌లో ఉండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందువుగా భావించి ఆ వ్యక్తిని పదే పదే కొట్టారు. అయితే సదరు స్త్రీ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె విజ్ఞప్తి చేసినప్పటికీ, వారు ఆ వ్యక్తిని వేధిస్తూనే ఉన్నారు.

అతని నుండి శిశువును తీసివేయడానికి కూడా ప్రయత్నించారు. నిందితులు ఈ చర్యను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. చార్మినార్ ఎస్సై మహమ్మద్ ఖలీల్ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం వేట కొనసాగించారు. ఈరోజు ఉదయం చార్మినార్ వద్ద ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షేనలుగురు వ్యక్తులు షేక్ అయాన్, సయ్యద్ ఫిర్దౌస్, మొహమ్మద్. షాబాజ్, మహ్మద్ ఫర్హాన్ అహ్మద్‌లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుండి వైరల్ వీడియో క్లిప్ ఉన్న మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story