కేజీఎఫ్ లో రాకీ భాయ్ ను చూసి.. చూసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

'Inspired' by KGF’s Rocky Bhai, 15-year-old smokes full pack of cigarettes. సినిమాల్లో హీరోలు చేసే పనులను అనుకరించే వాళ్లు చాలా మందే ఉంటారు.

By Medi Samrat  Published on  28 May 2022 10:59 AM GMT
కేజీఎఫ్ లో రాకీ భాయ్ ను చూసి.. చూసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

సినిమాల్లో హీరోలు చేసే పనులను అనుకరించే వాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లకు ఏది మంచో.. ఏది చెడో తెలియదు. గతంలో పలువురు హీరోలను అనుకరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన కేజీఎఫ్-2 సినిమా యువతకు ఎంతగానో నచ్చింది. హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాకీ భాయ్ సిగరెట్ తాగే సీన్ హైలెట్ గా నిలుస్తుంది. అలా ఒక టీనేజర్ రాకీ భాయ్ లాగా తాగాలని అనుకుని ఆసుపత్రి పాలయ్యాడు. అది కూడా హైదరాబాద్ కు చెందిన టీనేజర్.

KGF చాప్టర్ 2 రెండు రోజుల్లో మూడు సార్లు చూసిన హైదరాబాద్‌ కు చెందిన 15 ఏళ్ల బాలుడు రాకీ భాయ్ స్టైల్ లో సిగరెట్ తాగాలని.. ఫుల్ ప్యాక్ సిగరెట్ తాగాడు. దీంతో అతనికి తీవ్రమైన గొంతునొప్పి, దగ్గు రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం హైదరాబాద్‌లోని సెంచరీ ఆసుపత్రి వైద్యులు అతడికి చికిత్స చేశారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఇలా చేయడం తప్పురా నాయనా అని అన్నారు.

టీనేజర్లు ఇలాంటి క్యారెక్టర్స్ చూసి సులభంగా ప్రభావితమవుతారు.. అలాగే ఈ పిల్లాడు కూడా ధూమపానానికి అలవాటు పడ్డాడని నిపుణులు తెలిపారు. సిగరెట్ ప్యాకెట్‌ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మన సమాజంలో సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం.. సిగరెట్లు తాగడం లేదా పొగాకు నమలడం లేదా మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత చిత్ర బృందాలకు ఉందని పలువురు చెబుతున్నారు. ఇక టీనేజ్ పిల్లలను తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో కనిపెట్టుకుని ఉండాలని వైద్యులు హితవు పలికారు.

Next Story