అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం.. ఉప్పల్ స్టేడియంలో డీజీపీ
ఈరోజు ఉదయం కోల్‌కతాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
By - Medi Samrat |
ఈరోజు ఉదయం కోల్‌కతాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన మెస్సీ. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు.. మెస్సీ బస చేయనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలతో పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
మెస్సీ పర్యటనలో భాగంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశంలో మెస్సీని ప్రత్యక్షంగా కలిసే అవకాశం 100 మందికి మాత్రమే కల్పించారు. ఇందుకోసం వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను జారీ చేసి, కఠిన నియంత్రణల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈరోజు ఉదయం కోల్‌కతాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం మరియు దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు టిక్కెట్ ఉన్నవారికే స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా 34 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
మొత్తంగా మెస్సీ హైదరాబాద్ పర్యటనను సురక్షితంగా, ఘనంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.