సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ డిపోలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీసీ సిబ్బంది చూస్తుండగానే క్షణాల్లో బస్సు దగ్థమైంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు దగ్థమైన బస్సుకు సమీపంలోనే మరో బస్సుకు ఛార్జింగ్ పెట్టగా.. ఆ బస్సును అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు. లేకపోలే ఆ బస్సు కూడా దగ్థమయ్యేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మూడు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.