హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: నగరంలో జూలై 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ శాఖ అంచనా వేసింది.

By అంజి  Published on  3 July 2023 7:16 AM GMT
Hyderabad, IMD Hyderabad, Rainfall

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: నగరంలో జూలై 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు అంటే చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆ శాఖ తెలిపింది. అదనంగా, నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. ఈ వాతావరణ నమూనా జూలై 4, 5 తేదీలకు సంబంధించి అంచనా వేయబడింది.

గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33.1 డిగ్రీలు, 22.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.

ఐఎండీ హైదరాబాద్, టీఎస్‌డీపీఎస్‌ రెండూ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని.. నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story