క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో గతేడాది కంటే మెరుగైన ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్
IIT Hyderabad 9th best technical institution in India. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
By Medi Samrat Published on 10 Jun 2022 4:30 PM ISTక్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-హెచ్) గతేడాది కంటే మెరుగైన ర్యాంక్ సాధించింది. 2023 సంవత్సరానికి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌ను వెల్లడించారు. ఇందులో ఐఐటీ-హెచ్ 581-590 ర్యాంకుల శ్రేణిలో నిలిచింది. గతేడాది ఈ సంస్థకు 591-600 శ్రేణిలో ర్యాంక్ లభించింది. 2021లో ఇదే జాబితాలో ఐఐటీ-హెచ్ 601వ ర్యాంకు సాధించింది. QS Quacquarelli Symonds యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం, IIT హైదరాబాద్ దేశంలో 9వ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. దేశంలో మొత్తం ర్యాంకింగ్స్‌లో ఇది 14వ సంస్థ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు దేశంలోనే బెస్ట్ గా నిలిచింది. టెక్నికల్ యూనివర్సిటీ విభాగంలో ఐఐటీ బాంబే మొదటి స్థానంలో ఉంది. గత నాలుగేళ్లుగా ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకుంటూ వస్తున్నామని, వచ్చే ఏడాది ప్రపంచంలో టాప్ 500లోపు ర్యాంక్ సాధిస్తామనే నమ్మకం ఉందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అన్నారు.
ఇదే ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 751-800, ఉస్మానియా యూనివర్సిటీకి 1201-1400 శ్రేణి ర్యాంకులు దక్కాయి. ఇక జాతీయస్థాయిలో చూస్తే భారత్ నుంచి ఒక్క సంస్థకూ టాప్-100లో చోటు లభించలేదు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంతర్జాతీయ స్థాయిలో 155ర్యాంకు సాధించింది. భారత్‌లోని విద్యాసంస్థల్లో దీనిదే అత్యుత్తమ ర్యాంకు. ఆ తర్వాత బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్‌పూర్ ఐఐటీలకు మెరుగైన స్థానాలు లభించాయి. మొత్తంగా సుమారు 1500 సంస్థలకు ర్యాంకులు ప్రకటించగా... భారత్ నుంచి 41 సంస్థలకు ఈ జాబితాలో చోటు దక్కింది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) అత్యంత పోటీతత్వ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2023లో 751-800 శ్రేణిలో ర్యాంక్ పొందింది. UoH "అధిక పరిశోధన తీవ్రత మరియు సమగ్ర విషయ దృష్టితో స్థాపించబడిన మధ్య తరహా ప్రభుత్వ విశ్వవిద్యాలయం"గా వర్గీకరించబడింది.
"UoH మళ్లీ 1400 ప్లస్ టాప్ గ్లోబల్ యూనివర్శిటీలలో ర్యాంక్ సాధించడం శుభ సూచకం. మొత్తం ర్యాంకింగ్‌లను ప్రభావితం చేసిన కొన్ని విషయాలలో మేము జారిపోయాము. అందుకు ఇతర కారణాలు ఉన్నప్పటికీ ఇది ఆందోళన కలిగిస్తోంది. మునుపటి సంవత్సరాల ర్యాంకింగ్‌తో పోలిస్తే ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ర్యాంకింగ్ లో దిగజారిపోయాయి. మేం మేధోమథనం చేసి, ర్యాంకింగ్స్‌లో ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలకు చేరుకుంటాము, "అని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజె రావు అన్నారు.