టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ ఇచ్చింది.
By Medi Samrat
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ ఇచ్చింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లోని కొన్ని కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు వసంత కృష్ణ ప్రసాద్ కు సంబంధించిన ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో కూల్చివేశారు. వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు.
2005లో ఈ భూమిని కొనుగోలు చేశామని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని ఆరోపించారు.