కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

నగరంలోని కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది

By -  Knakam Karthik
Published on : 10 Feb 2026 12:56 PM IST

Hyderabad, Kondapur, HYDRAA, Land grabbers, GHMC Officers

కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్​ నగరంలోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. నగరంలోని కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది. కొండాపూర్‌లోని శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం – మదీనగూడ మార్గంలో జంగమోని కుంట ఉంది. ఈ కుంటను కొందరు కబ్జా చేశారు. మట్టి పోసి 4 ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. వాటిని విక్రయించేందుకు యత్నించారు.

అయితే జంగమోని కుంట ఆక్రమణలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, జీహెచ్​ఎంసీ అధికారులతో హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో మంగళవారం ఉదయం వాటిని తొలగించారు. అనంతరం కుంట చుట్టూ ఫెన్సింగ్​ వేశారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story