బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 10 Oct 2025 10:57 AM IST

Hyderabad, Banjara Hills, Hydraa, government land, Encroachment

బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది. 5 ఎకరాలలో జలమండలి కి 1.20 ఎకరాలను గతంలో కేటాయించిన ప్రభుత్వం, 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. అటు చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపాలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డు లు నిర్మించుకొని పహరా పెట్టుకున్నాడు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు చేశాడు. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు. దీంతో జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడన్న హైడ్రా ..పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులను రెవెన్యూ, జలమండలి పెట్టింది. 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు హైడ్రా తెలిపింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించుకున్న హైడ్రా..షేక్‌పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టింది. అటు పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను హైడ్రా తొలగించింది. అనంతరం 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.

Next Story