ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం, ఐదంతస్తుల భవనాన్ని కూల్చిన హైడ్రా
మియాపూర్‌లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది.
By - Knakam Karthik |
ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం, ఐదంతస్తుల భవనాన్ని కూల్చిన హైడ్రా
హైదరాబాద్: మియాపూర్‌లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని శనివారం కూల్చివేసింది. అమీన్‌పూర్‌లో అనుమతులు తీసుకొని మియాపూర్ లోని ప్రభుత్వ భూమి(HMDA కు చెందిన)లో అక్రమ కట్టడాలు చేపట్టడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అమీన్‌పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలు చేపట్టినట్టు నిర్ధారించుకుంది.
అమీన్‌పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/D , 126/ part, 126/C గా ప్లాట్లు సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు. మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. ఫేక్ LRS సృష్టించి భాను కన్స్‌ట్రక్షషన్స్ యజమానులు నిర్మించింది. LRS కోసం డబ్బులు చెల్లించినట్టు పేర్కొన్న DD కూడా ఫేక్ దని తేలింది. ఇప్పటికే అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేసారు.
మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమి లోకి జరిగి 5 అంతస్తుల నిర్మించడంపై హైడ్రాకు HMDA అధికారులు ఫిర్యాదు చేసారు. స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మించినట్టు హైడ్రా నిర్ధారించుకుంది. 2014లో LRS ఫేక్ పత్రాల సృష్టించినట్టు నిర్ధారించింది. అన్నీ పరిశీలించిన దరిమిలా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు శనివారం మియాపూర్ పరిధిలోకి వచ్చిన భవనాన్ని హైడ్రా తొలగించింది.